తెలంగాణ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు: ఇది గర్వకారణమన్న మంత్రి జూపల్లి

హైదరాబాద్ సిటీ ప్రతినిధి (వార్త సంధ్య)ఏప్రిల్ 21: నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన 'దివ్య భారత్' పర్యాటక నివేదికలో తెలంగాణ రాష్ట్రానికి విశిష్ట గుర్తింపు లభించడంపై పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైవిధ్యభరితమైన పర్యాటక సామర్థ్యానికి ఈ నివేదిక అద్దం పడుతోందని, ఇది తెలంగాణకు గర్వకారణమని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ గుర్తింపు నిదర్శనమని ఓ...