రామాంజనేయ కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
మిగిలిన డ్రైనేజీ, రోడ్ల పనులు పూర్తి చేస్తామని హామీ నాగోల్ డివిజన్, ఏప్రిల్ 29 (వార్త సంధ్య) : నాగోల్ డివిజన్ పరిధిలోని రామాంజనేయ కాలనీవాసుల అభ్యర్థన మేరకు ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కాలనీలో పర్యటించారు.ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా డ్రైనేజీ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇటీవల ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చొరవతో దాదాపు రూ.66 లక్షల వ్యయంతో డ్రైనేజీ పనులు మంజూరు చేసి పూర్తి చేయించడంతో సమస్యలు కొంతవరకు పరిష్కారమయ్యాయని కృతజ్ఞతలు తెలిపారు.అయితే...