భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 22 (వార్త సంధ్య) : కాళేశ్వరం బహుళ దశ సాగునీటి పథకానికి సంబంధించి జస్టిస్ పీ.సీ.ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు వెలువరించిన తీర్పు పట్ల హర్షం ప్రకటిస్తూ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావుకు పుష్పగుచ్ఛం అందజేసి మిఠాయి తినిపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బుధవారం సాయంత్రం కేటీఆర్ ని రవిచంద్ర కలిశారు. అలాగే ఎంపీ రవిచంద్ర మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు కే.పీ.వివేకానంద, కాలేరు వెంకటేష్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎంపీ మాలోతు కవిత, నాయకులు అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, చిరుమళ్ల రాకేష్,గెల్లు శ్రీనివాస్ యాదవ్, కోతి కిశోర్ గౌడ్, తుంగబాలు, బోయిండ్ల విద్యాసాగర్, డాక్టర్ కురవ విజయ్ కుమార్ తదితరులకు మిఠాయిలు పంచి హైకోర్టు తీర్పు పట్ల తన సంతోషాన్ని పంచుకున్నారు.