Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 1:00 pm Posted by : VARTHA SANDHYA DESK

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

హయత్ నగర్ ప్రతినిధి, ఏప్రిల్ 26 (వార్త సంధ్య):

వనస్థలిపురం హుడా సాయినగర్ కాలనీలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి అమ్మవారి జయంతి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో ఐక్యత, సేవా భావం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. వాసవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ భారస పార్టీ అధ్యక్షులు చింతల రవికుమార్ గుప్తా, గౌరవ అధ్యక్షులు సునీల్ కుమార్ గుప్తా, అధ్యక్షులు కిరణ్ కుమార్ గుప్తా, ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్ గుప్తా, కోశాధికారి వెంకటేశ్వర్లు గుప్తా, ఉపాధ్యక్షులు సతీష్ కుమార్ గుప్తా, సుధాకర్ గుప్తా, సహాయ కార్యదర్శులు కిరణ్ గుప్తా, మల్లికార్జున గుప్తా, నిర్వాహ కార్యదర్శి ఆనంద్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక నాయకులు, కాలనీవాసులు, మహిళలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు.