ఉపాధి హామీ కూలీలతో మమేకమైన మంత్రి పొన్నం ప్రభాకర్
పనుల పురోగతి, వేతనాలు, సమస్యలపై ఆరా కరీంనగర్, జూన్ 13 (వార్త సంధ్య): హుస్నాబాద్ నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మార్గమధ్యంలో ఉపాధి హామీ పథకం కింద పనులు నిర్వహిస్తున్న కూలీలను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనుల పురోగతి, పనుల నిర్వహణ విధానం, వేతనాల చెల్లింపులు, పని పరిస్థితులు తదితర అంశాలపై కూలీలతో నేరుగా మాట్లాడారు. పనులు జరుగుతున్న ప్రదేశాలను పరిశీలించిన మంత్రి,...