తండ్రి చికిత్స కోసం సీజ్‌ చేసిన బంగారం తాకట్టు.. కానిస్టేబుల్‌ అరెస్ట్‌!

రూ.12.37 లక్షలు రుణంగా పొందినట్లు ఆరోపణలు మరో కేసులో సీజ్‌ చేసిన సెల్‌ఫోన్‌ నుంచి రూ.1.70 లక్షల అక్రమ బదిలీ మీర్పేట, అక్టోబర్ 31 (వార్త సంధ్య): ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన పోలీసు శాఖలోనే సీజ్‌ చేసిన సొత్తు దుర్వినియోగం ఘటన వెలుగులోకి వచ్చింది. కేసుల దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం, సెల్‌ఫోన్లను అక్రమంగా వినియోగించిన ఆరోపణలపై మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రవణ్‌ అరెస్టయ్యాడు. ఒక కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌ నుంచి రూ.1.70 లక్షలను అక్రమంగా...