Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 6:40 pm Posted by : జడల నాగప్రసాద్

ఆర్టీసీ కార్మికులకు అండగా నిలుస్తాం మేయర్ మూడ్ గణేష్

  • చనిపోయిన ఆర్టీసీ కార్మికుడికి సంతాపం
  • 32 డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుంది
  • పోరాడితేనే హక్కులు సాధ్యం…

భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 24 (వార్త సంధ్య) : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, వారి న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు తాము అండగా నిలుస్తామని కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ స్పష్టం చేశారు. కార్మికులు నిర్వహిస్తున్న ధర్నాలు, సమావేశాల్లో పాల్గొంటూ ఆయన వారికి ధైర్యం నింపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసే శక్తి ఎర్రజెండాకే ఉందని, ఎప్పటికప్పుడు కార్మికుల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. సమస్యలు పోరాటంతోనే పరిష్కారం అవుతాయని, అందరూ ఐక్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ముందు ఉంచిన 32 డిమాండ్లు ఆమోదం పొందే వరకు కార్మికులతో పాటు నిలుస్తామని, సమ్మె విజయవంతం అయ్యే వరకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కూడా కార్మికుల పక్షాన ఎర్రజెండా అగ్రభాగాన నిలిచి పోరాటాన్ని కొనసాగిస్తుందని, సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఈ ఉద్యమం ఆగదని మేయర్ మూడ్ గణేష్ స్పష్టం చేశారు.