అన్నపురెడ్డిపల్లి లో ఆధ్యాత్మిక వెల్లువ
శ్రీవారి సన్నిధిలో వైభవంగా 'మహా కుంభాభిషేకం' సతీసమేతంగా పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నపురెడ్డిపల్లి, వార్త సంధ్య, మే 06: అన్నపురెడ్డిపల్లి గ్రామం బుధవారం ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడింది. శ్రీశ్రీశ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించిన మహా కుంభాభిషేక మహోత్సవం భక్తి పారవశ్యంతో సాగింది. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. లోక కల్యాణార్థం నిర్వహించిన ఈ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సతీసమేతంగా పాల్గొన్నారు. పరమపూజ్య శ్రీశ్రీశ్రీ త్రిదండి...