డప్పు కొట్టే మాదిగలకు నెలకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలి

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు టీఎంఆర్పీఎస్ వినతి చండ్రుగొండ, ఆగస్టు 18 (వార్త సంధ్య): సంప్రదాయ కళ అయిన డప్పును వాయిస్తూ జీవనం సాగిస్తున్న మాదిగ కళాకారులకు నెలకు రూ.5 వేల పెన్షన్‌ మంజూరు చేయాలని తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (టీఎంఆర్పీఎస్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కలిసి వినతిపత్రం అందజేశారు. టీఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గుండా రమేష్‌ మాదిగ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ నాయకులు ఎమ్మెల్యేను కలిసి మాదిగల సమస్యలను ఆయన...