ఎల్బీనగర్ నియోజకవర్గంలో మరో మణిహారం: దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఫ్లైఓవర్ క్రింద నూతన క్రీడా మైదానాల ఏర్పాట్లు యువత, చిన్నారులు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక సదుపాయాలు ఉచిత ప్రవేశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే హయత్‌నగర్ ప్రతినిధి, మార్చి 16 (వార్త సంధ్య): ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రజల కోసం మరో ప్రత్యేక సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఆలేఖ్య టవర్స్ నుంచి ఎల్.బి.నగర్ ఫ్లైఓవర్ క్రింద నూతనంగా నిర్మించిన క్రీడా మైదానాలను ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఫ్లైఓవర్ల...