ఆలయ పూజారుల హక్కుల కోసం కుమ్మర్ల ఆందోళన
డిండి రహదారిపై భారీ నిరసన.. సంప్రదాయ పూజారిత్వ హక్కులు కాపాడాలని డిమాండ్ నాగర్‌కర్నూల్, జూన్ 11 (వార్త సంధ్య): నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలం లత్తిపూర్ గ్రామంలోని శ్రీ కట్ట మైసమ్మ దేవస్థానంలో తరతరాలుగా పూజారులుగా సేవలందిస్తున్న కుమ్మర్ల హక్కులను పరిరక్షించాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం డిమాండ్ చేసింది. ఆలయ పూజారిత్వ హక్కులను కాపాడాలని కోరుతూ గురువారం డిండి ప్రాజెక్టు సమీపంలోని ఆలయం వద్ద భారీ నిరసన దీక్ష నిర్వహించింది. డిండి కట్ట మైసమ్మ ఆలయం వద్ద తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం...