తెలంగాణకు కాంగ్రెస్‌నే మొదటి శత్రువు: కేటీఆర్

కాంగ్రెస్ పాలన డిజాస్టర్.. తెలంగాణను తిరోగమనంలోకి నెట్టింది బీఆర్ఎస్‌కు 90కి పైగా సీట్లు ఖాయం..  కేసీఆర్ మా తురుపుముక్క సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్, వార్త సంధ్య: తెలంగాణ రాష్ట్రానికి దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీనే మొదటి శత్రువని, తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర అభివృద్ధి వరకు ప్రతి దశలోనూ కాంగ్రెస్ ద్రోహం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్ర స్థాయిలో విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బుధవారం నిర్వహించిన...