కేసీఆర్, కేటీఆర్ పాలనను ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారు: డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్, జూలై 23 (వార్త సంధ్య): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని వికారాబాద్ పట్టణంలో గురువారం పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఈ కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, వారి బంధువులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. వికారాబాద్ పట్టణ మాజీ అధ్యక్షుడు గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా రామయ్యగూడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు,...