కొత్తగూడెం కేంద్రంగా రైల్వే డివిజన్ పరిశీలనలో ఉంది : కేంద్రం వివరణ
ఎంపీ వద్దిరాజు వినతికి స్పందన ప్రత్యుత్తరం రాసిన రైల్వే మంత్రి వైష్ణవ్ భద్రాద్రి జిల్లా బ్యూరో, మే 07 (వార్త సంధ్య) : భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేసే అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉపనేత, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కు రాసిన లేఖలో రైల్వే డివిజన్ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) రైల్వే స్టేషన్...