ప్రజా సేవకు అంకితం.. లెనిన్ నగర్‌లో ‘KLR ఉచిత ప్రజా సేవా కేంద్రం’ ప్రారంభం

పేద, బలహీన వర్గాలకు ప్రభుత్వ పథకాల చేరువే లక్ష్యం: సామిడి గోపాల్ రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 3 (వార్త సంధ్య): సమాజంలోని పేద, బలహీన వర్గాల అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 'KLR ఉచిత ప్రజా సేవా కేంద్రం' లెనిన్ నగర్‌లో ఘనంగా ప్రారంభమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో చేరేలా చేయడంతో పాటు ప్రజా సమస్యలకు మార్గదర్శకత్వం అందించడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు....