కీసర ఏసీబీ దెబ్బ.. ఖాకీ తీరుపై మచ్చ
రూ.5 లక్షల లంచం కేసులో సీఐ, ఎస్‌ఐ అరెస్ట్.. స్టేషన్ వ్యవహారాలపై పర్యవేక్షణ ఎక్కడ? సోదాల్లో నగదు, పత్రాలు లభించినట్లు సమాచారం.. స్థానికుల పటాకుల ఘటనతో మరింత చర్చ పోలీస్‌స్టేషన్లపై అంతర్గత నిఘా వ్యవస్థ ఎలా పనిచేస్తోంది.. ఉన్నతాధికారులు సమీక్షించాల్సిన సమయమా? మేడ్చల్, సెప్టెంబర్ 22 (వార్త సంధ్య): కీసర పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకున్న ఏసీబీ ట్రాప్ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. ఓ కేసులో స్టేషన్ బెయిల్ విషయంలో రూ.5 లక్షల లంచం తీసుకుంటున్నారన్న ఫిర్యాదుపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)...