కర్ణంగూడను జిల్లాకు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి  -ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక గ్రామసభలో పిలుపు రంగారెడ్డి జిల్లా, వార్త సంధ్య: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామస్థులతో నేరుగా మమేకమయ్యారు. గ్రామాభివృద్ధి, వ్యవసాయం, పారిశుద్ధ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, ఓటరు జాబితా పునర్విమర్శ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది సాధారణం...