ఎల్‌బీ స్టేడియంలోని కనకదుర్గ ఆలయంలో నూతన మూలవిరాట్ పునఃప్రతిష్ఠా మహోత్సవం ప్రారంభం
హంపి విద్యారణ్య భారతీ స్వామివారి కరకమలములచే ప్రారంభమైన వైభవోపేత కార్యక్రమాలు జూలై 12న రోహిణి నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో అమ్మవారి మూలవిరాట్ ప్రతిష్ఠ హైదరాబాద్, జూలై 10 (వార్త సంధ్య): హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియం ప్రాంగణంలోని శ్రీశ్రీశ్రీ కనకదుర్గ దేవాలయంలో నూతన మూలవిరాట్ పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పరమపూజ్య శ్రీశ్రీశ్రీ హంపి విద్యారణ్య భారతీ స్వామివారి కరకమలములచే మహోత్సవాలను ప్రారంభించగా, వేదాంతం రాజనర్సింహాచార్యులు (రాజు పంతులు) వేదోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర నిజ...