జవహర్‌నగర్‌లో భూముల గుట్టు..!
మూడు ఎకరాలు.. 120 ప్లాట్లుగా విభజించారా? మాజీ సైనికులకు కేటాయించిన భూములేనా? ప్రభుత్వ భూమా.. లావణి పట్టా భూమా.. అసలు హక్కుదారులు ఎవరు? హైదరాబాద్/జవహర్‌నగర్, సెప్టెంబర్ 25 (వార్త సంధ్య):జవహర్‌నగర్‌లో భూముల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ భూములు, లావణి పట్టా భూములు, మాజీ సైనికులు, వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు గతంలో కేటాయించిన భూములకు సంబంధించి రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సుమారు మూడు ఎకరాల భూమిని 80 గజాల చొప్పున ప్లాట్లుగా విభజించి...