కంచే చేను మేస్తుందా?
జవహర్‌నగర్‌లో అసైన్డ్ భూముల భూదందా.. వరుస కథనాలు వచ్చినా కదలని రెవెన్యూ యంత్రాంగం! స్థానిక రెవెన్యూ అధికారుల మౌనం వెనుక ఆంతర్యమేమిటి? కలెక్టర్‌కు వాస్తవాలు చేరుతున్నాయా? లేక సమాచారం మధ్యలోనే మాయమవుతోందా? జవహర్‌నగర్, నవంబర్ 1 (వార్త సంధ్య): ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులదే. అసైన్డ్ భూములు, మాజీ సైనికులకు కేటాయించిన భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగంపై ఉంది. కానీ జవహర్‌నగర్ పరిధిలో వెలుగుచూస్తున్న భూముల వ్యవహారం చూస్తుంటే కంచే చేను మేస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి....