సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనులు వేగవంతం చేయాలి: కమిషనర్ కె. శివకుమార్ నాయుడు
కల్వకుర్తి,పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాల పురోగతిపై సమీక్ష పరిహారం, పునరావాసం, పెండింగ్ కేసుల పరిష్కారంపై అధికారులకు కీలక ఆదేశాలు రంగారెడ్డి జిల్లా బ్యూరో , జూన్ 12 (వార్త సంధ్య): సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, పరిహారం చెల్లింపుల ప్రక్రియలను వేగవంతం చేసి పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ పునరావాసం, పునరుపాధి మరియు భూసేకరణ (R&R & LA) కమిషనర్ కె. శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశంలో పాల్గొనేందుకు కలెక్టరేట్‌కు...