Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 5:31 pm Posted by : VARTHA SANDHYA DESK

అభివృద్ధి జోరు.. రూ.2.15 కోట్ల పనులకు ఎమ్మెల్యే మల్ రెడ్డి శ్రీకారం

 పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను  ప్రారంబించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 25 (వార్త సంధ్య):
ఇబ్రహీంపట్నం మండల అభివృద్ధిలో మరో కీలక ఘట్టం నమోదైంది. మండలంలోని నెర్రపల్లి, దండుమైలారం, ముక్కునూర్, పోల్కంపల్లి గ్రామాల్లో రూ.2 కోట్ల 15 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి శ్రీకారం చుట్టారు.నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, విద్యా మరియు ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇబ్రహీంపట్నాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే తమ సంకల్పమని తెలిపారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.భారీ నిధులతో చేపడుతున్న ఈ పనులు మండల రూపురేఖలను మార్చనున్నాయని, గ్రామాల అభివృద్ధికి ఇవి కీలకమని అన్నారు. ప్రజల ఆశీస్సులతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఇబ్రహీంపట్నాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే వెల్లడించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.