హోటళ్లలో బొద్దింకలు.. ఎలుకల సంచారం!
హైదరాబాద్లో హోటళ్లపై టీజీ సేఫ్ కొరడా.. 544 కిలోల కలుషిత ఆహారం ధ్వంసం వంటగదుల్లో అపరిశుభ్రత.. గుట్కా ప్యాకెట్లు, సింథటిక్ రంగుల వినియోగం! 22 హోటళ్లలో తనిఖీలు.. 14 హోటళ్ల లైసెన్సుల సస్పెన్షన్ హైదరాబాద్, అక్టోబర్ 31 (వార్త సంధ్య): నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేస్తున్నారా? వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించాల్సిన హోటళ్లలోనే బొద్దింకలు, ఎలుకల సంచారం కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. అపరిశుభ్ర వంటగదులు, బూజుపట్టిన ఆహార పదార్థాలు, పదేపదే వినియోగించిన వంట నూనె వంటి ఉల్లంఘనలపై...