హుస్నాబాద్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, జూన్ 11 (వార్త సంధ్య): హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు అవసరమైన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో ప్రధానంగా స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ, వర్షాకాలానికి ముందస్తు సన్నాహక చర్యలపై విస్తృతంగా చర్చించారు. గతంలో భారీ వర్షాల...