ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జయేష్ రంజన్, ఐఏఎస్, టీజీఐఐసీ సీఈఓ రవీంద్రనాథ్ రెడ్డి
ఏఐ ఆధారిత కస్టమర్ అనుభవ పరిష్కారాలతో కొత్త ప్రమాణాలు
ప్రతి నెల 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం: సీఈఓ ఎన్‌కేటీ షా

హైదరాబాద్, జూన్ 17 (వార్త సంధ్య): స్థానిక భాషల్లో కస్టమర్ అనుభవసీఎక్స్ పరిష్కారాలను ప్రముఖ సంస్థ అందిస్తున్న హెచ్‌ఆర్‌హెచ్ నెక్స్ట్, హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో తన నాలుగవ నూతన కార్యాలయాన్ని బుధవారం నాడు ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరైన కార్యాలయాన్ని ప్రారంభించారు, టిజీ ఐఐసీ సీఈఓ రవీంద్రనాథ్ రెడ్డి ప్రత్యేక అతిథిగా ఉన్నారు.
ఈ సందర్భంగా సంస్థ సీఈఓ ఎన్ కే టి షా, హెడ్-హెచ్‌ఆర్ ప్రియా మాధురి మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు (ఏఐఐ) ఆధారిత కస్టమర్ పరిష్కారాల ద్వారా దేశవ్యాప్తంగా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. సంస్థ అభివృద్ధి చేసిన “AINA” (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ది న్యూ ఏజ్) ప్లాట్‌ఫామ్ ద్వారా స్థానిక భాషల్లో అత్యాధునిక సేవలను అందిస్తూ కస్టమర్ ఎంగేజ్‌మెంట్ రంగంలో కొత్త ప్రమాణాలను సృష్టిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ సంస్థ ద్వారా ప్రతి నెల దాదాపు 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఇది నాలుగో బ్రాంచ్ కాగా, దక్షిణ భారతదేశంలో ఎనిమిదో బ్రాంచ్ అని చెప్పారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసి మంచి వాక్చాతుర్యం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగిన యువతీ యువకులకు తమ సంస్థలో మంచి భవిష్యత్తు ఉంటుంది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఈ సద్వినియోగం చేసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు.
2007లో స్థాపించబడిన హెచ్‌ఆర్‌హెచ్ నెక్స్ట్, 80 సంవత్సరాలకు పైగా వారసత్వం కలిగిన హెచ్‌ఆర్‌హెచ్ గ్రూప్‌లో భాగంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, కోయంబత్తూరు, వరంగల్, నిజామాబాద్, తుమకూరు, పాలకాడ్ తదితర నగరాల్లో సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. బహుభాషా కస్టమర్ రంగంలో విశ్వసనీయ భాగస్వామిగా ఎదిగిన ఈ సంస్థ ప్రస్తుతం 2,500 మందికి పైగా ఉద్యోగులతో 25కి పైగా సంస్థలకు సేవలు అందిస్తోంది.
అభివృద్ధి సంస్థ చేసిన AINA ప్లాట్‌ఫామ్ ఆధునిక ఏఐఐ సాంకేతికత, స్థానిక భాషా సామర్థ్యాలు, స్వరం, ఉద్దేశం, భావోద్వేగాలపై సందర్భోచిత అవగాహనను సమన్వయం చేయడం ద్వారా సహజమైన, వ్యక్తిగతీకరించిన సేవలను అందిస్తోంది. భారతదేశంలోని భాషా వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ప్లాట్‌ఫామ్ వ్యాపార సంస్థలకు మానవీయమైన, నిరాటంకమైన కస్టమర్ అనుభవాన్ని అందించేలా రూపొందించబడింది.
హెచ్ ఆర్‌హెచ్ నెక్స్ట్ ప్రస్తుతం ఇన్‌బౌండ్ కాల్ సెంటర్ సేవలు, ఓమ్నీ ఛానల్ కాంటాక్ట్ సెంటర్ సేవలు, డిజిటల్ బీపీఓ సేవలు, వాయిస్‌బాట్, చాట్‌బాట్ పరిష్కారాలు, ప్రీమియం స్థానిక భాషా సేవలు, కాంటాక్ట్ సెంటర్ సేవలు, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, స్పీచ్ అనలిటిక్స్, అడ్వైజరీ & కన్సల్టింగ్ సేవలు, డిజిటల్ సేవలు అందిస్తోంది.
1938లో హైదరాబాద్ రేడియో హౌస్‌గా ప్రారంభమైన సంస్థ, 2002లో టెలికాం రంగంలోకి ప్రవేశించింది. అనంతరం 2012లో పూర్తి స్థాయి కాంటాక్ట్ సెంటర్ సేవలను ప్రారంభించి వేగంగా అభివృద్ధి చెందింది. 2024లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో లిస్టింగ్ ద్వారా మరో కీలక మైలురాయిని పొందింది.
హైటెక్ సిటీలో కొత్త కార్యాలయం ప్రారంభంతో ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, అనలిటిక్స్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ టెక్నాలజీలలో మరింత విస్తరణకు శ్రీకారం చుట్టినట్లు సంస్థ. క్లయింట్లకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు ఈ కార్యాలయం దోహదపడనుంది.
2026 మరియు ఆ తర్వాత కాలానికి స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతున్న హెచ్‌ఆర్‌హెచ్ నెక్స్ట్, ఐఐఐ ఆధారిత, వ్యక్తిగతీకరించిన, అత్యంత మానవీయమైన కస్టమర్ అనుభవాలను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని సంస్థ ప్రతినిధులు తెలిపారు .