ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ నుంచి జాగ్రత్తలు తప్పనిసరి
మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లొద్దని జిల్లా వైద్యాధికారి సూచన పెద్దపల్లి, ఏప్రిల్ 25 (వార్త సంధ్య): పెద్దపల్లి జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడదెబ్బ (హీట్ వేవ్) వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, మరణాలను నివారించేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సూచించారు.మధ్యాహ్నం 11 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని, బయటకు వెళ్లేటప్పుడు తలపై గుడ్డ లేదా టోపీ ధరించి, గొడుగు ఉపయోగించాలని తెలిపారు....