RTI సమాచారం ఇవ్వనందుకు హయత్నగర్ MEO శ్రీనివాస్‌కు రూ.5,000 జరిమానా
RTI కార్యకర్త, అడ్వకేట్ మహేశ్ బాబు చోల్లేటి ఫిర్యాదుపై రాష్ట్ర సమాచార కమిషన్ చర్య హైదరాబాద్, జూలై 5 (వార్త సంధ్య ): సమాచార హక్కు చట్టం (RTI Act) కింద కోరిన సమాచారాన్ని నిర్దేశిత గడువులో అందించడంలో విఫలమైనందుకు హయత్నగర్ మండల విద్యాశాఖ అధికారి (MEO) శ్రీనివాస్‌కు రాష్ట్ర సమాచార కమిషన్ రూ.5,000 జరిమానా విధించింది. RTI కార్యకర్త, అడ్వకేట్ మహేశ్ బాబు చోల్లేటి దాఖలు చేసిన ఫిర్యాదును విచారించిన రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్, సంబంధిత అధికారి సమాచారం ఇవ్వడంలో...