ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విప్లవం సాధ్యమే – 3, 4, 5 తరగతుల విద్యార్థులతో అసాధారణ ఫలితాలు: కర్నాటి సురేంద్రబాబు
ప్రపంచంలో అగ్రగామి యూనివర్సిటీ విద్యార్థులతో ఇంగ్లీష్ బేసిక్ లో పోటీ పడగల సత్తా మా విద్యార్థులది:విద్యావేత్త కర్నాటి సురేంద్రబాబు హైదరాబాద్, జూన్ 14 (వార్త సంధ్య):ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రాథమిక స్థాయి విద్యార్థులతో వినూత్న బోధనా విధానాన్ని అమలు చేసి ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించామని విద్యావేత్త కర్నాటి సురేంద్రబాబు తెలిపారు.సోమాజిగూడ లో ప్రెస్ క్లబ్ హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లుగా తెలంగాణలోని మూడు ప్రభుత్వ పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థులపై ప్రత్యేక ఇంగ్లీష్ బోధనా విధానాన్ని...