గోదావరి ఇసుకపై సీబీఐ దర్యాప్తు జరపాలి
ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి రూ.2 లక్షల కోట్ల నిధులు విడుదల చేయాలి పీసా, 1/70 చట్టాల అమలులో వైఫల్యంపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు, చందా లింగయ్య దొర డిమాండ్ హైదరాబాద్, జూన్ 6 (వార్త సంధ్య): భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో గోదావరి నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై సమగ్ర సీబీఐ దర్యాప్తు జరిపించాలని మాజీ డీజీపీ డా. జె. పూర్ణచంద్రరావు (ఐపీఎస్, విరమణ), అఖిల భారత బహుజన సమాజ్ పార్టీ (ఏఐబీఎస్పీ) జాతీయ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే, మాజీ...