ఏజెన్సీ యువతకు ఉపాధి దిశగా ‘గిరిదర్శక్’ ప్రారంభం

భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 29 (వార్త సంధ్య) : కొంగరకలాన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘గిరిదర్శక్’ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు.కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలను ప్రత్యేక దృష్టి ఉన్న జిల్లాలుగా గుర్తించిన నేపథ్యంలో, గతంలో మావోయిస్టుల ప్రభావం ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.భద్రాచలం, పర్ణశాల, కిన్నెరసాని వంటి ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలు ఉన్న...