- కాంగ్రెస్ పార్టీకి, ఫోర్ ఇంక్లైన్ గ్రామపంచాయతీకీ తీరని లోటు
- విచారం వ్యక్తం చేసిన బిజెపి నాయకురాలు సముద్రాల గాయత్రి
భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 29 (వార్త సంధ్య) : సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కొత్తగూడెం మండల మాజీ జెడ్పిటిసి సభ్యులు గిడ్ల పరంజ్యోతి రావు మరణం కాంగ్రెస్ పార్టీకి, ఫోర్ ఇంక్లైన్ గ్రామపంచాయతీకీ తీరని లోటని బీజేపీ నాయకురాలు సముద్రాల గాయత్రి తెలిపారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించి అగ్ర నాయకుల మన్ననలు పొందారు.స్వతంత్ర అభ్యర్థిగా త్రీ ఇంక్లైన్ ఎంపీటీసీగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం ప్రజా సేవలో కొనసాగుతూ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. స్వర్గీయ పీవీ నరసింహరావు ఆధ్వర్యంలో ఏర్పాటైన మాల మహానాడు సంస్థను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు.వారి మరణంపై సముద్రాల గాయత్రి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరంజ్యోతి రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.