మహిళల భద్రతపై కాంగ్రెస్ రాజీ పడదు: గజ్జెల కాంతం

బీఆర్ఎస్ పాలనలో మహిళలు, దళితులు, గిరిజనులపై దాడులు జరిగాయని ఆరోపణ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక బీజేపీ కుట్ర ఉందని విమర్శ హైదరాబాద్, జూన్ 12 (వార్త సంధ్య): మహిళల భద్రత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం స్పష్టం చేశారు. గురువారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో మహిళలు, బాలికలపై వందలాది అత్యాచారాలు, దాడులు జరిగాయని ఆరోపించారు. కేటీఆర్, హరీష్‌రావు కనుసన్నల్లోనే మహిళలు, దళితులు, గిరిజనులపై...