Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 10:51 am Posted by : kasaramkrushna@gmail.com

బాధిత కుటుంబానికి అండగా మాజీ సర్పంచ్ – 50 కిలోల బియ్యం అందజేత

దుబ్బాక ప్రతినిధి ఏప్రిల్ 22(వార్త సంధ్య ):దుబ్బాక మండల పరిధిలోని పెద్ద చీకోడ్ గ్రామానికి చెందిన నాందిరి మల్లేశం ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసి, మృతుడి కుటుంబాన్ని పరామర్శిస్తూ బుధవారం నాడు 50 కిలోల బియ్యాన్ని అందజేశారు.ఈ సహాయ కార్యక్రమం తౌడ శ్రీనివాస్ (మాజీ సర్పంచ్) ఆదేశాల మేరకు నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మృతుడి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నాందిరి బిక్షపతి, నాందిరి రామయ్య, నాందిరి చిత్తారి (డుబ్బులు), నాందిరి పెద్ద బిక్షపతి, బొందన్నగారి యాదగిరి, బొంగురపు వెంకటరెడ్డి, మాడ అశోక్, అలుగుల యాదగిరి, అలుగుల ప్రకాశ్, పున్న స్వామి తదితరులు పాల్గొన్నారు.