విశ్వాసమా..? విజ్ఞానమా? చేప ప్రసాదం వివాదం చెప్పే పాఠం
శాస్త్రీయ ఆధారాలు లేని ఆరోగ్య వాదనలను ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించాలి? — చార్వాక SCIENTIFIC STUDY FORUM (SSF) మృగశిర కార్తె సందర్భంగా ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో నిర్వహించే చేప ప్రసాదం కార్యక్రమం మరోసారి సిద్ధమయింది. వేలాది మంది ప్రజలు, ముఖ్యంగా ఆస్తమా మరియు ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారు, ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అయితే ఈ సందర్భంగా సమాజం, ప్రభుత్వం, వైద్య రంగం మరియు పౌర సమాజం ముందు ఒక ప్రాథమిక ప్రశ్న ఉంది. చేప ప్రసాదం పేరుతో ఆస్తమా వంటి...