రామక్కపేటలో అగ్నిప్రమాదం – నీలగిరి తోట దగ్ధం

దుబ్బాక ప్రతినిధి ఏప్రిల్ 25(వార్త సంధ్య ) : దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు సాల్వేరి అంజయ్యకు చెందిన ఆకారం రోడ్డులో ఉన్న నీలగిరి తోటలో ఒక్కసారిగా మంటలు చెలరేగి తోట మొత్తం దగ్ధమైంది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో సమీపంలోని ఇతర పంట పొలాలకు ప్రమాదం తప్పింది.అగ్నిప్రమాదం కారణంగా రైతుకు భారీ ఆస్తి నష్టం...