రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా డాక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి బాధ్యతలు స్వీకరణ

రంగారెడ్డి, ఏప్రిల్ 26 (వార్త సంధ్య): కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి ఆదివారం రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆమె జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని, తన పదవిలో బాధ్యతలను చేపట్టారు. అనంతరం అధికారులతో సమావేశమై జిల్లాలోని స్థానిక సంస్థల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష చేపట్టినట్లు సమాచారం.ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని డాక్టర్ కిరణ్మయి తెలిపారు.