దేవతలగుట్టను మింగేస్తున్న అక్రమ మైనింగ్?
పేలుళ్ల శబ్దాలతో వణికిపోతున్న స్థానికులు.. రెవెన్యూ, మైనింగ్ అధికారుల తీరుపై ప్రశ్నలు చారిత్రక గుట్ట ఆనవాళ్లే లేకుండా పోతాయంటున్న ప్రజలు హైదరాబాద్, అక్టోబర్ 1 (వార్త సంధ్య): చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో గుర్తింపు పొందిన దేవతలగుట్ట నేడు అక్రమ మైనింగ్ ఆరోపణలతో ప్రమాదంలో పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుట్టపై జరుగుతున్నట్లు చెబుతున్న తవ్వకాలు, భారీ పేలుళ్ల కారణంగా గుట్ట స్వరూపం క్రమంగా దెబ్బతింటోందని, సమీప కాలనీల్లో నివసించే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని వారు పేర్కొంటున్నారు. దేవతలగుట్టకు సంబంధించిన భూముల్లో ఆర్సీఐ,...