ఇంధన ధరల పెంపు, ధాన్యం కొనుగోలు ఆలస్యంపై సిపిఐ భారీ నిరసన

కేంద్ర ప్రభుత్వ విధానాలపై నాయకుల తీవ్ర ఆగ్రహం రైతులకు నష్టం చేస్తున్న నిర్ణయాలపై ఖండన పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు భద్రాద్రి జిల్లా బ్యూరో, వార్త సంధ్య, మే 06: గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల పెంపు, సరఫరాలో కొరత, అలాగే మొక్కజొన్న ధాన్యం కొనుగోలు ఆలస్యంపై సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన ధర్నా ఉత్కంఠభరితంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ పాల్గొని...