పేదల కోసం పోరాడుతున్న సిపిఐకి విరాళాలు ఇవ్వండి: కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్, ఏప్రిల్ 1 (వార్త సంధ్య):భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్‌లో నిర్వహించిన సామూహిక నిధి సేకరణ కార్యక్రమాన్ని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల హక్కుల సాధన కోసం కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు. సమాజంలో దోపిడీ, పీడనలేని వ్యవస్థ అయిన సోషలిజం లక్ష్యంగా పార్టీ అనేక ఉద్యమాలను నిర్మిస్తోందన్నారు. అనుబంధ సంఘాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా పోరాటాలు కొనసాగిస్తున్నామని...