-
ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు
-
ఆరు గ్యారంటీలు, రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్
-
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి
పెద్దపల్లి, మంథని, మార్చి 16 (వార్త సంధ్య): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రా రావు మరియు మంథని నియోజకవర్గ ఇంచార్జ్ చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు మంథని మండల, పట్టణ అధ్యక్షులు విరబోయిన రాజేందర్, సబ్బాని సంతోష్ ఆధ్వర్యంలో సోమవారం మంథని ఎమ్మార్వో కి వినతి పత్రం ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్న ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఆసరా పెన్షన్ పెంపు , రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ, రైతు భరోసా, కౌలు రైతులకు 1200, మహిళలకు 2500 మహాలక్ష్మి పథకం, విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు స్కూటీ, వంట గ్యాస్ సబ్సిడీ, పలు హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ అలాగే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరుతూ ప్రభుత్వ దృష్టికి తీసుకవేళ్ళాలని ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు తోట మధుకర్, నియోజకవర్గ కో కన్వీనర్ నాంపల్లి రమేష్ , మండల ప్రధాన కార్యదర్శిలు కొడారి దేవేందర్, బూడిద రాజు, సామల అశోక్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఎల్కా సదానందం, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రేపాక శంకర్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కరెంగుల రాజశేఖర్, మాజీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి బోయిని నారాయణ, మాజీ పట్టణ అధ్యక్షుడు బూడిద తిరుపతి, మండల కార్యదర్శి బూడిద విష్ణు, జిల్లా నాయకులు నరమల్లా కృష్ణ , సీనియర్ నాయకులు గుడ్ల గుర్వేశ్, నాయమల్ల విజయ్, జెట్టి శంకర్, ఎలకుర్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు.