సిపిఐ కార్యాలయంలో ఘనంగా కామ్రేడ్ లెనిన్ 156వ జయంతి వేడుకలు
అశ్వాపురంలో ఉత్సాహంగా నిర్వహణ లెనిన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు విప్లవ సిద్ధాంతాలపై నేతల ప్రాసంగాలు భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 22 (వార్త సంధ్య) : అశ్వాపురం మండలం సిపిఐ కార్యాలయంలో రష్యా విప్లవకారుడు కామ్రేడ్ లెనిన్ 156వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ మండల కార్యదర్శి అంతనేని సురేష్, లెనిన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లెనిన్ సామ్రాజ్యవాదాన్ని పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశగా...