గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి
ఇందిరమ్మ ఇళ్ల నుంచి సీసీ రోడ్ల వరకు.. చండ్రుగొండలో అభివృద్ధి పనులకు శ్రీకారం చండ్రుగొండ, ఆగస్టు 18 (వార్త సంధ్య): గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఉమ్మడి జిల్లా పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి అన్నారు. సోమవారం చండ్రుగొండ మండలంలో వారు విస్తృతంగా పర్యటించి, మొత్తం రూ.2.23 కోట్లకు పైగా నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మొదట కరిసెలబోడు గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను సందర్శించి...