Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 11:58 am Posted by : VARTHA SANDHYA DESK

తెలంగాణ భవన్‌లో కేటీఆర్, హరీష్ రావు ను కలిసిన వాసుమల్ల

  • పార్టీ బలోపేతం, యువత పాత్ర పై కీలక చర్చలు
  • బీఆర్ఎస్ సిద్ధాంతాలపై కట్టుబాటును పునరుద్ఘాటించిన యువ నాయకులు

 

భద్రాద్రి జిల్లా బ్యూరో, మే 02 (వార్త సంధ్య) : మేడే సందర్భంగా హైదరాబాద్‌లో ని తెలంగాణ భవన్‌ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావులను బీఆర్ఎస్ యువ నాయకుడు వాసుమల్ల గౌతమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పార్టీ బలోపేతం, యువత పాత్ర, భవిష్యత్ కార్యాచరణపై సార్థక చర్చలు జరిగాయి. పార్టీ అభివృద్ధిలో యువశక్తి కీలక పాత్ర పోషించాల్సిన అవసరాన్ని నాయకులు ప్రస్తావించారు. అలాగే బీఆర్ఎస్ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని, పార్టీకి అండగా నిలుస్తామని యువ నాయకులు స్పష్టం చేశారు.