పాలమూరును ఎడారిగా మార్చే కుట్రలను అడ్డుకుంటాం: శ్రీనివాస్ గౌడ్

కర్ణాటక ప్రాజెక్టులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలంటూ బీఆర్ఎస్ హెచ్చరిక అవసరమైతే మరోసారి ఆర్డీఎస్ పాదయాత్ర చేపడతామని ప్రకటన హైదరాబాద్, జూన్ 23 (వార్త సంధ్య): కర్ణాటక ప్రభుత్వం కృష్ణా నదిపై చేపడుతున్న ప్రాజెక్టులు పాలమూరు జిల్లాకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, పట్నం నరేందర్ రెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాలమూరును శాశ్వత కరవు జిల్లాగా మార్చే కుట్రలు జరుగుతున్నాయని...