Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 2:20 pm Posted by : VARTHA SANDHYA DESK

భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ

ఎల్‌బీనగర్‌లో జెండా ఆవిష్కరణ – పార్టీ బలోపేతానికి పిలుపు

ఎల్‌బీనగర్‌ , ఏప్రిల్ 27 (వార్త సంధ్య):  భారత్ రాష్ట్ర సమితి (భారస) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో లింగోజిగూడా డివిజన్ పరిధిలోని లిబర్టీ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ స్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దూరదృష్టి నాయకత్వంతోనే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైందని తెలిపారు. ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.

భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి, తిలక్ రావు, రాజశేఖర రెడ్డి, ఆడాల రమేష్, దయానంద్, రాకేష్ ఠాగూర్ తదితరులు, నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.