ఘనంగా బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

దుబ్బాక ప్రతినిధి ఏప్రిల్ 27(వార్త సంధ్య ): దుబ్బాక మండల పరిధిలోని హబ్షీపూర్ గ్రామంలో భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ 26వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకొని గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, సంబరాలు జరుపుకున్నారు.హబ్షీపూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలెంల రామచంద్రారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధనే లక్ష్యంగా పుట్టిన పార్టీ, నేడు 26 వసంతాలు పూర్తి చేసుకోవడం గర్వకారణమని, కార్యకర్తల శ్రమతోనే పార్టీ...