దుబ్బాక ప్రతినిధి ఏప్రిల్ 27(వార్త సంధ్య ): దుబ్బాక మండల పరిధిలోని హబ్షీపూర్ గ్రామంలో భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ 26వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకొని గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, సంబరాలు జరుపుకున్నారు.హబ్షీపూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలెంల రామచంద్రారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధనే లక్ష్యంగా పుట్టిన పార్టీ, నేడు 26 వసంతాలు పూర్తి చేసుకోవడం గర్వకారణమని, కార్యకర్తల శ్రమతోనే పార్టీ ఈ స్థాయికి చేరిందని పేర్కొన్నారు.
పార్టీ సీనియర్ నాయకులు, వార్డ్ ఇన్చార్జ్లు,మాజీ మరియు తాజా ప్రజా ప్రతినిధులు,పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, యువకులు మరియు గ్రామ ప్రజలు ఈ వేడుకలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జెండా ఆవిష్కరణ అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ వైస్ ఎంపిపి ఆస్క రవి, సోషల్ మీడియా అధ్యక్షుడు సాగర్ మహారాజ్ ,వార్డు సభ్యులు నరేష్,ఎల్లారెడ్డిలు పాల్గొన్నారు. వీరితో పాటు నాయకులు శంకర్, తిరుపతి,రవి వై,రాజు,ఎండి సజ్జు, భార్గవ్,రాజు,ఎల్లారెడ్డి, రాజిరెడ్డి, రామ్ రెడ్డి,ఎండి గౌస్, డాక్టర్ ఆశం,రాజు, పరశురాములు, ఉషయ్య, అశోక్, భాను,శంకర్,బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.