దుబ్బాక ప్రతినిధి ఏప్రిల్ 27(వార్త సంధ్య ) దుబ్బాక మండలం చీకోడ్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాజీ సర్పంచ్ తౌడ శ్రీనివాస్ సమక్షంలో జరిగింది. గ్రామ అధ్యక్షుడు బొందనగారి మల్లేశం బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కార్యకర్తలు నినాదాలతో గ్రామాన్ని మార్మోగించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో చీకోడ్‌లో సత్తా చాటుతామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు షరీఫ్, రజిత నర్సింలు, మాజీ కోఆప్షన్ సభ్యులు ఇస్మాయిల్, అరుణోదయ సురేశ్, నాయకులు పెంటం రాజు, మాడ అశోక్, గడ్డం నరేష్, చెలుకల శ్రీనివాస్ రెడ్డి, దొడ్ల కిషన్ గౌడ్, నాందిరి భిక్షపతి, కుంబాల రాజు, అలుగుల్ల దేవయ్య, కమ్మరి శ్రీనివాస్, బొందనగారి యాదగిరి, కాసారం కృష్ణ, బొంగురపు వెంకటరెడ్డి, ఇనుప శ్రీకాంత్, బాయికాడి శివ కుమార్, ఎండీ రఫీ, పసుపునూరి దేవరాజు, గొట్టిగళ్ల చంద్రం, మోసర్ల ఎల్లారెడ్డి, గడ్డం సత్యనారాయణ, సోనమైన మల్లయ్య, అలుగుల్ల ప్రకాష్, కాసులబాద పెంటయ్య, ఎండీ మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.