శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌పై ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి: బాస్
హైదరాబాద్, జూలై 15 ( వార్త సంధ్య ): ఉత్తరప్రదేశ్‌లోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ (బాస్) డిమాండ్ చేసింది. బుధవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాస్ చీఫ్ కోఆర్డినేటర్, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజ శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా కోట్లాది మంది భక్తులు భగవంతుడు...