ఘనంగా శ్రీ బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవం
కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కత్తి కార్తిక గౌడ్ దుబ్బాక ప్రతినిధి ఏప్రిల్ 28(వార్త సంధ్య ):దుబ్బాక మండలం రఘుత్తంపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీ బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజల్లో పాల్గొని, శ్రీ బీరప్ప కామరాతి దేవుళ్ల ఆశీస్సులు స్వీకరించారు. గ్రామ ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ లక్ష్మీనారా గౌడ్, గణేష్, పరుశురామ్, శ్రీ మల్లికార్జున...